నా వ్యవసాయం
పుట్టింది, పెరిగింది రైతు కుటుంభం లో కావడం వల్ల నాకు మొక్కలు అంటే వల్లమాలిన ఇష్టం. ఆ ఇష్టం కలగడం కూడా చాలా తమాషాగా జరింగింది . నాకు ఐదు, ఆరు సంవత్సరాల వయసు వున్నప్పుడు రోజు మా నాన్న చీకటి తో లేచి ట్రాక్టర్ వేసుకొని పొలానికి వెళ్ళిపోయేవాడు. నేను నిద్ర లేచేప్పటికి కనిపించే వాడు కాదు. కానీ సాయంత్రం ౩ గంటల నుండి ఆరు గంటల మధ్య లో మల్లా తిరిగి వచ్చేవాడు. తను సాయంత్రం వచ్చేప్పటికి రోజు నాన్నని, కొక్కానికి తగిలిస్తున్న నాన్న చొక్కాకి వున్నా జేబుని గమనిచేదాన్ని. ఆ జేబులో తేలికగా నోట్లు , బరువు గా చిల్లర కనిపిస్తూ ఉండేవి. ఆ వయసులో నాకు జేబులో ఎవరన్నాఎక్కువ చిల్లర డబ్బుతో కనపడితే వాళ్ళ దగ్గర చాలా డబ్బు వుంది, వీళ్ళ అందరి దగ్గర డబ్బు ఎలా వచ్చింది, ఎందుకు నా దగ్గర లేదు అనుకునేదాన్ని, అలా ఒకరోజు నాన్నని అడిగేసా? ఎందుకు అంత పొద్దున్నే పొలానికి వెళ్తున్నావ్ ? జేబు లో నీకు అన్ని డబ్బులు ఎక్కడివి
అని? వెంటనే మా నాన్న రోజు నేను పొలానికి డబ్బుల చెట్లు పెంచడానికి వెళ్తున్నా, ఆ చెట్లకి బోలెడన్ని రూపాయలు కాస్తాయి, వాటినే జేబు లో వేసుకొని తెస్తున్నాఅని చెప్పాడు, అప్పుడు నా మొహం చూడాలి.
ఇలా వెలిగిపోయింది,దానికి తోడు అప్పుడప్పుడు జేబు నిండా రేగు పళ్ళు , గురివింద గింజలు కూడా కోసుకొని వచ్చే వాడు, ఎక్కడివి అంటే డబ్బుల చెట్ల లాగే , రేగు చెట్లు, గురివింద చెట్లు కూడా పెంచుతున్నానీకు ఇష్టమని అని చెప్పేవాడు ,నేను
నమ్మేసా ! ఇక అడుగు పెట్టా నా ఊహా లోకం లోకి, ఇక చేట్టు చూస్తె చాలు రూపాయి మాలక్ష్మి చెట్టుకు వేల్లాడుతూ
రా రా అంటూ పిలుస్తూ
కనిపించేది, ఎలా ఐనా రూపాయిలు కాసే చెట్టును నా కళ్ళతో చూడాలి , పెంచాలి అని కన్పించిన వన్నికంకణాలు గా కట్టా చేతికి . ఎలా గా అని తీవ్రం గా
ఆలోచించి నా ప్రతిపాదనని మా నాన్న ముందు ఉంచా ? నేను కూడా పొలానికి నీతో పాటు వస్తా రూపాయి చెట్టు చూడడానికి , చూసాక నేను కూడా తెచ్చి ఇంటి దగ్గర పెంచు కుంటా అని, వెంటనే మా నాన్న ఇలా వికటాట్ట
హాసం చేస్తూ , పిచ్చిపిల్లా డబ్బులు ఎప్పుడు చెట్లకు కాయవు అని చేసిన జ్ఞాన బోధకు నేను ఇలా
నాలిక కరచుకొని
రా రమ్మని రా రా రమ్మని పిలిచిన నా డబ్బు చెట్టు కు
రాను రాను అని చెబుతూ నా ఊహలకు
టాటా చెప్పేసా, కానీ ఎలా ఐనా సరే ఏవో కొన్ని చెట్లు పెంచాలి అని డిసైడ్ ఐపోయా. ఇది నాకు మొక్కల ఫైన ఏర్పడిన మొదటి ఇష్టం, ఇక ఎవరింట్లో నన్నా పూల మొక్కలో , కూరగాయ మొక్కలో కనపడితే సిగ్గు , మొహమాటం ఏమి లేకుండా వెళ్లి అడిగేసేదాన్ని. నాకు ఒక
మొక్క ఇవ్వండి , మా ఇంట్లో పెంచుకుంటాం అని , వాళ్ళు ఇచ్చేదాక వదిలేదాన్ని కాదు , ఏదో మల్లె అంటో, సన్నజాజి అంటో, మందారమో ఇలా ఏదో ఒకటి అడిగి తెచ్చి ఇంట్లో అమ్మ వాళ్ళ చేత నాటిన్చేదాన్ని. కాని ఎన్ని మొక్కలు వేసినా బతికేవి కాదు. ఏవో కొన్ని ఆకు కూరలు తప్పితే , ఇక ముసలమ్మా లాగా సణుగుడు
మొదలు పెట్టేదాన్ని. ఇంత పెద్ద ఇల్లు ఒక్క మొక్క కూడా బతకదు, అసలు మంచి మట్టి పోయించఋ, నీళ్ళు కూడా ఉప్పు నీళ్ళు , మోటార్ వేఇస్తే మంచి నీళ్ళు పడతాయి, అది ఇది గుడ్డు కూసు అని అని ఏదో ఒకటి అంటూనే నా బాధ ని వెల్లకక్కేదాన్ని. ఇలా నాకు తొమ్మిది సంవత్సరాల వచ్చేదాకా ఇదే తంతు . పూలు అన్నా మహా పిచ్చి వుండేది , సన్నజాజులు అంటే మరీను. ఎవరో ఒకరి ఇంటికి వెళ్లి అడిగి మరి తెచ్చుకొని పెట్టుకునేదాన్ని, పూలు అంటే అంత ఇష్టం పెంచుకోకూడదు అని మా అమ్మ చెబుతూనే వుండేది , ఐనా పిల్ల చేష్టలు ఎక్కడికి పోతాయి.









తాత్కాలికంగా మొక్కలు పెంచడాన్ని పక్కన పెట్టినా, ఆ పది సంవత్సరాల హాస్టల్ లైఫ్ లో.. మా ఉమ్మడి కుటుంభం లో వున్ననాన్న వాళ్ళు నలుగురు సపరేట్ ఫ్యామిలీ లు పెట్టడం తో , ఇక వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో, కొత్త మట్టి తో, ఊరిలోకి గుండ్లకమ్మ మంచి నీళ్ళ సరఫరాతో మొక్కలు చక్కగా పెంచుకున్నారు అందరూ. మా అమ్మ మాత్రం .. కూర లోకి కరివేపాకు నుండి మొదలుపెట్టి, నిమ్మచెట్టు, మామిడి చెట్టు, దానిమ్మ చెట్టు, అన్ని రకాల కూరగాయలు, గోంగూర, తోటకూర, పూలలో నందివర్ధనం, మందారం, సన్నజాజి, విరజాజి, మల్లె, గులాబీ, కనకాభారం, అలోవేర, ఏ మొక్కకి పూలు పూచినా, కాయ కాసిన నన్ను తలచు కోకుంటా వుండదు ఇప్పటికి కూడా... కాని నా హాస్టల్ లైఫ్ లో సెలవలకు ఇంటికి వచ్చినప్పుడు వీటి అన్నింటిని తడిమి తడిమి చూసుకునేదాన్ని. కాని అన్ని పెరిగి పెద్దఅయ్యేప్పటికి నేను అమెరికా కి వచ్చేసా పెళ్లి చేసుకొని. ఆరు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి ఇక్కడికి వచ్చి , మొదటి ఏడు ఇక్కడి వాతావరణం లో ఎలా పెంచాలో తెలియక ఆగిపోయాను, రెండవ ఏడు ఎలా ఐనా స్టార్ట్ చేయాలి అని, అసలే రైతు బిడ్డని, దేశం కాని దేశం లో ఒక మొక్క ఐనా పెంచాలి, ఒక కాయ ఐనా కాయించాలి అని మల్లా కంకణం కట్టా ! రైతు బిడ్డని అనే కిరీటాన్ని తలకు పెట్టా



ఈ లింక్ ఫై ఒక క్లిక్ క్లిక్కి , నా తోట ఫై ఒక లుక్ వేసి రండి.
http://geethas-gardening.blogspot.com/
Posted at ఆదివారం, జులై 31, 2011 | Labels: నా ఇష్టాలు | 12 Comments